pm కిసాన్ 12వ విడత తేదీ మరియు సమయం

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. 

రైతులకు ఆర్థికంగా ఆసరా ఉండేందుకు కేంద్ర సర్కార్‌ ప్రధాన్‌ మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజనం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 

 ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 

రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్‌ డబ్బులు త్వరలో అకౌంట్లో జమ కానున్నాయి.

ప్రతి ఏడాది కేంద్రం దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6,000లను అందిస్తోంది.

మూడు వితల్లో ఈ డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 

ఇప్పటికే 11వ విడత రూ.2వేలను అకౌంట్లో జమ చేయగా, ఇప్పుడు 12వ విడత డబ్బులు రానున్నాయి.

 ఈ విడత డబ్బులు ఆగస్టు 31 లేదా సెప్టెంబర్‌ 1వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

పీఎం కిసాన్ యోజన సొమ్ము అందకపోతే ఏం చేయాలి?